కరోనా వైరస్ విపత్తు నివారణ సహాయ చర్యల కోసం పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 27 లక్షల విరాళాలు సేకరించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సంస్థలు, వ్యాపారులు, దాతలు ద్వారా విరాళాలు సేకరించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఈ మెుత్తానికి సంబంధించిన చెక్కును అమరావతి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్కు అందజేశారు. కరోనాపై పోరుకు తనవంతుగా కృషి చేసిన నాగేశ్వరరావును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం - కరోనాపై పోరుకు సహాయం
కరోనాపై పోరు సాగించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలో సేకరించిన రూ.27 లక్షల విరాళాలను ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్కు అందజేశారు.
కరోనాపై పోరుకు రూ. 27 లక్షల విరాళం