ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు: ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి - అనపర్తిఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

MLA Suryanarayana Reddy: అధికారుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ రైతులతో సమావేశమైన ఆయన.. నూతన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వాలంటీర్లకు పనులు అప్పగించడం ఏంటని అధికారులను నిలదీశారు. రెండ్రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించారు.

MLA Suryanarayana Reddy
MLA Suryanarayana Reddy

By

Published : Nov 9, 2022, 3:25 PM IST

MLA Suryanarayana Reddy fired at officials: అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సివిల్ సప్లైస్ కమిషనర్ అరుణ్ కుమార్​తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా అధికారులు కొత్త విధానాలను అవలంబిస్తున్నారని.. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సూర్యనారాయణరెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో అన్నదాతలకు ఇబ్బందులు: ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి

నూతన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలి.. రెండు రోజుల్లో పరిష్కారం చేపట్టకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తా. -సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details