ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాయు'గండం': ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ప్రసాద రాజు - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

mla prasada raju visit narsapur coastal area in west godavari district
హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ప్రసాద రాజు

By

Published : Oct 12, 2020, 7:11 PM IST

వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో సముద్రం కెరటాలతో అల్లకల్లోలంగా ఉంటుందని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం తీరప్రాంత గ్రామాలైన పెదమైనవానిలంక, కేపి పాలెం, పేరుపాలెం గ్రామాలలో పర్యటించారు.

ప్రభుత్వ హెచ్చరికల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందని... భయపడొద్దని ప్రసాదరాజు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details