ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డిసెంబర్ 25న నరసాపురంలో 8266 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం' - Distribution of houses to the poor on December 25 in Narasapuram

డిసెంబర్ 25 న పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ప్రసాద రాజు తెలిపారు. ఆయన నివాసంలో ఇందుకు సంబంధించిన విషయాలపై గృహ నిర్మాణ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు.

డిసెంబర్ 25న నరసాపురంలో 8266 మందికి  ఇళ్ల పట్టాలు అందిస్తాం
డిసెంబర్ 25న నరసాపురంలో 8266 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం

By

Published : Nov 26, 2020, 6:50 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే ప్రసాద రాజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 25 పేదలకు ఇళ్లు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నరసాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఇళ్ల స్థలాలు, లే అవుట్స్ గురించి చర్చించారు. తమ నియోజకవర్గంలో మొత్తం 8266 ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. నరసాపురం అర్బన్ 4635, నర్సాపురం రూరల్ 2643, మొగల్తూరు 988 ఇళ్ల పట్టాలు లభ్దిదారులకు అందజేస్తామన్నారు. సొంత ఇళ్ల స్థలంలో ఇళ్లు నరసాపురం రూరల్​లో 1320, నరసాపురం అర్బన్​లో 7, మొగల్తూరు మండలంలో 2739 మంజూరయ్యాయన్నారు. నరసాపురం నియోజకవర్గంలో 71 లే అవుట్లు ఉండగా నరసాపురం అర్బన్​లో 2 లే అవుట్లు, నరసాపురం రూరల్ 44, మొగల్తూరు 25 లే అవుట్లు ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details