పట్టణ ప్రాంతం నిరుపేదలకు తెదేపా పాలనలో నిర్మించిన బహుళ అంతస్తుల ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా.. జగన్ ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పట్టణ సమీపంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 90 శాతం పూర్తైన ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని.. లేదంటే నెలవారి అద్దె లబ్ధిదారులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. పట్టణ లబ్ధిదారులకు కనీసం సెంటున్నర ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన కోరారు.
తెదేపా ప్రభుత్వంలో పూర్తైన ఇళ్లను పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే నిమ్మల - MLA Nimmala Ramanayudu protest for poor people houses news update
90 శాతం పూర్తైన పేదల ఇళ్లను పంపిణీ చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పట్టణ సమీపంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన