ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుకను తులాల లెక్కన అమ్మిన ఎమ్మెల్యే!

బంగారాన్ని మనం గ్రాముల్లోనో, తులాల్లోనో కొంటుంటాం.. మరి ఇసుకను.. అలా అమ్మడం ఎప్పుడైనా చూశామా..? కానీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇసుకను బంగారం లెక్కన అమ్మారు. తమ ప్రాంతంలో ఇసుక... బంగారం అయిపోయిందని తెలిపేందుకు ఈ పని చేశారు.

mla nimmala ramanaidu variety protest
ఇసుక ధరలపై ఎమ్మెల్యే వినూత్న నిరసన

By

Published : Jun 4, 2020, 1:34 PM IST

Updated : Jun 5, 2020, 12:33 PM IST

ఇసుకను తులాల లెక్కన అమ్మిన ఎమ్మెల్యే!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రోడ్డు మీద తోపుడు బండిని తోస్తూ కనిపించారు. ఎమ్మెల్యే గారు.. రోడ్డుపైన ఏం అమ్ముతారు అని చూస్తే.. కవర్లలో ప్యాకింగ్ చేసిన ఇసుక ఉంది. అలా రోడ్డుపైన కొంత దూరం వెళ్లి.. ఇసుకను ఒక ప్రాంతంలో విక్రయించడం మొదలుపెట్టారు. బంగారాన్ని తూచే చిన్న తక్కెడలో తులాల లెక్కన ఇసుకను విక్రయించారు.

అంటే.. తన నియోజకవర్గంలో ఇసుక.. బంగారంతో సమానంగా రేటు పలుకుతుందని చెప్పడం అన్నమాట. తమ ప్రాంతంలో ఇసుకను బ్లాక్ మార్కెటింగ్ చేసి భారీ ధరలకు విక్రయిస్తున్నారని... సామాన్యులు ఇసుకను కొనే పరిస్థితి లేదని రామానాయుడు చెబుతున్నారు. ఇసుక ధరల తీవ్రత తెలియడం కోసమే ఆయన ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ, తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

Last Updated : Jun 5, 2020, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details