ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ బిల్లుల పెంపుపై ఎమ్మెల్యే నిరసన - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్​లు నిరసన దీక్ష చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్​ కార్యాలయం వరకు కాలి నడకన లాంతర్లతో ప్రదర్శనగా నిరసన తెలిపారు.

mla-nimmala-ramanaidu
విద్యుత్​ బిల్లుల పెంపుపై ఎమ్మెల్యే నిరసన

By

Published : May 22, 2020, 10:31 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్​లు నిరసన దీక్ష చేపట్టారు. కష్ట కాలంలో పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన లాంతర్లు పట్టుకొని విద్యుత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఏడీఏకు వినతి పత్రం ఇచ్చారు. కార్యాలయం వద్ద రుబ్బురోలు, కిరోసిన్ లాంతర్, విసనకర్ర వంటి సాంప్రదాయ పనిముట్లును ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details