పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసుల నుంచి తప్పించుకోవడానికే చీకటి ఒప్పందానికి తెర తీశారని ఆరోపించారు.
తమను గెలిపిస్తే.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు సాధిస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పి.. చివరికి గెలిచిన తర్వాత వాటిని గాలిలో కలిపేశారని విమర్శించారు. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటుపరం చేయడానికి చూస్తున్నారన్నారు.