ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులపై ప్రజా తీర్పు అడిగే ధైర్యం ఉందా?: నిమ్మల - జగన్​పై నిమ్మల రామానాయుడు విమర్శలు

మూడు రాజధానులపై ప్రజా తీర్పు అడిగే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. లక్ష కోట్ల ఆదాయానిచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

mla nimmala ramanaidu criticises ycp government on three capitals
నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే

By

Published : Aug 4, 2020, 8:38 PM IST

అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో 2014లో అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్.. నేడు 3 రాజధానులను ప్రకటించడం ఎంతవరకు సమంజసమని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 30వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను ఆనాడు స్వాగతించి నేడు ఎందుకు మాట మార్చారని నిలదీశారు. రాజధానిగా అమరావతే ఉంటుందంటూ ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రాజధాని కోసం లక్ష కోట్లు అవసరమని చెప్తున్న ప్రభుత్వం.. అమరావతిని నిర్మిస్తే లక్షకోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. మూడు రాజధానులపై ప్రజా తీర్పు అడిగే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details