ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన.. ఎమ్మెల్యే అరెస్ట్ - ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లాలో నిరసన తెలపడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నందున ఎమ్మెల్యేతో పాటు మిగతా నాయకులను స్టేషన్​కు తరలించారు.

mla nimmala ramanaidu arrest
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్

By

Published : Aug 1, 2020, 3:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమరావతి రైతులకు మద్దతుగా నిరసన తెలపడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రైతులు కాటన్ దొర విగ్రహం వద్ద ఆందోళనలు చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. వైకాపా శ్రేణుల సంబరాలకు అనుమతిచ్చినవారు.. మాకెందుకు ఇవ్వరంటూ నిమ్మల ప్రశ్నించారు. బలవంతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించటంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details