ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి నిధులు మంజూరుకై.. మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం - ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తాజా వ్యాఖ్యలు

నవరత్నాల అమల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణకు.. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు. పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

mla karumuri venkata nageswara rao
మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేత

By

Published : Jan 5, 2021, 2:06 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలో రహదారులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విన్నవించారు. నవరత్నాల అమల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో రహదారులు, కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఉన్న అతిథి గృహం శిధిలావస్థలో ఉన్నందున.. కొత్త భవనాలు నిర్మించడానికి నిధులు ఇవ్వాలని కోరారు.

వినతి పత్రంపై మంత్రి స్పందన..

వినతిపత్రంలో సమర్పించిన అంశాలపై స్పందించిన మంత్రి.. ప్రజలకు అవసరమైన రహదారులు నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అతిథి గృహానికి నిధులు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి...

ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత జగన్​కే దక్కుతుంది: బొత్స

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details