'వలస కూలీల పట్ల అప్రమత్తంగా ఉండాలి' - 'వలస కూలీల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాన్స్ జెండర్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో నియోజకవర్గంలో మొట్టమొదటి కేసు నమోదైందన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాన్స్ జెండర్కు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో నియోజకవర్గంలో మొట్టమొదటి కేసు నమోదైందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్కాఖ్యానించారు. తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన... కేసుకు సంబంధించి నిర్లక్ష్యం, అలసత్వం వహించిన ఉద్యోగులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున వాలంటీర్లు, ఆరోగ్య శాఖ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అటువంటివారిని వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.