ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం' - ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు వార్తలు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడమే నాడు-నేడు కార్యక్రమం లక్ష్యమని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు అన్నారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు.

mla kaarumuru
mla kaarumuru

By

Published : Jul 13, 2020, 8:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను ..నాడు-నేడు పథకం కింద అభివృద్ధి పరచనున్నట్లు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు వెల్లడించారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలనను రూ. కోటి 53 లక్షలతో నాడు-నేడు పనుల ద్వారా అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. అన్ని రకాల సదుపాయాలతో పాఠశాలలను తయారు చేస్తామని చెప్పారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ ఛైర్మన్ పనులు జరుగుతున్న తీరును ఎమ్మెల్యేకు వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details