ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో పారిశుద్ధ్య పనులపై ఎమ్మెల్యే తనిఖీలు - తణుకులో పారిశుద్ధ్యపనుల అమలుపై ఎమ్మెల్యే తనిఖీల వార్తలు

తణుకు పట్టణంలో పారిశుద్ధ్యపనుల అమలు తీరుపై శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్నా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు

By

Published : Nov 25, 2019, 12:56 PM IST

పశ్చిమగోదావరిజిల్లా తణుకు పట్టణంలో పారిశుద్ధ్యపనులు జరుగుతున్న తీరుపై శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రధాన రహదారితోపాటు సజ్జాపురం, హౌసింగుబోర్డు కాలనీ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే కలియతిరిగారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరుతోపాటు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వీటి నిర్వహణపై ఫిర్యాదులు వస్తే సహించబోనని ఎమ్మెల్యే హెచ్చరించారు. పరిశుభ్రతలో తణుకు పట్టణానికి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన స్థానం ఉందని, అటువంటి గౌరవానికి భంగం కలగకుండా పనులు చేయాలని కార్మికులకు సూచించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా పరిస్థితులు మెరుగుపరచాలని ఎమ్మెల్యే కారుమూరి.. మున్సిపల్‌ కమిషనర్‌ సాంబశివరావును, శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు.

తణుకులో పారిశుద్ధ్యపనుల అమలుపై ఎమ్మెల్యే తనిఖీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details