ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుందుర్రు గ్రామ దేవతల జాతర.. పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ - Village Goddess Fair at Tundurru news

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామ దేవతల జాతర వైభవంగా జరిగింది. మేళతాళాలతో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Village Goddess Fair
గ్రామ దేవతల జాతర

By

Published : Mar 1, 2021, 3:51 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామ దేవతలు శ్రీ ముత్యాలమ్మ మారమ్మ, మహాలక్ష్మమ్మ వారి 59వ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతర 5వ తేదీ వరకు కొనసాగనుంది. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామంలో ఊరేగింపు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

బాణాసంచా కాల్పులు, మేళతాళాలు, వివిధ రకాల నాట్యాలతో అమ్మవారి ఊరేగింపు పురవీధుల్లో అట్టహాసంగా జరిగింది. కన్నుల పండువగా అమ్మవారి మహోత్సవాలు జరిగాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details