నివర్ తుపాను ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, వీరవాసరం మండలాల్లో మునిగిపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 15 లోపు పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందించనున్నట్లు తెలిపారు. గత 30 ఏళ్లుగా నమోదు కాని వర్షపాతం ఈ సంవత్సరం నమోదైందని ఎమ్మెల్యే అన్నారు.
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే - MLA grandhi srinivas latest news
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి, తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. సీఎం జగన్ రైతులను ఆదుకుంటారని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.
![నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే MLA grandhi srinivas inspecting crop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9710703-832-9710703-1606710875216.jpg)
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే