పాలకొల్లు నుంచి ఏలూరు వరకు తెదేపాఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టారు. రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడదామంటే కలెక్టర్, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని పాలకొల్లు నుంచి సైకిల్‌పై ఏలూరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందచేయనున్నట్లు తెలిపారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. వారినుంచి స్పందన రాని కారణంగానే రైతుల కష్టాలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించేందుకు సైకిల్‌పై ఏలూరు వెళ్తున్నట్లు చెప్పారు.
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సైకిల్ యాత్ర - mla nimmala Ramanaidu eluru Cycle tour news
రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని తెదేపాఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా రైతుల సమస్యలపై పాలకొల్లు నుంచి ఏలూరు వరకు సైకిల్ యాత్ర చేపట్టారు.
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సైకిల్ యాత్ర