ఎమ్మెల్యే చింతమనేని నిరసన - pedavegi
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపును నిరసిస్తూ...ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధర్నా చేపట్టారు.
పేదవేగిలో
పశ్చిమ గోదావరి జిల్లాదెందులూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించాలంటూ వైకాపా వాళ్లేఫారం 7 కింద దరఖాస్తులు చేశారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. పెదవేగిలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.