పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని మల్లికాసులపేట అగ్నిప్రమాద బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎంపీ పరామర్శించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనలో కాలిపోయిన నగదు అమాత్యులకు చూపించి బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి... ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని మంత్రులు వారికి భరోసా ఇచ్చారు. ఘటనలో నిరాశ్రయులైన వారికి 3 నెలల్లోపే ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు వెల్లడించారు.
'తణుకు అగ్నిప్రమాద బాధితులకు 3నెలల్లో ఇళ్లు' - ministers visit fire accident place in thanuku
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మల్లికాసులపేటలో అగ్నిప్రమాద బాధితులను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. 3 నెలల్లోపు ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
మా బతుకులు 'అగ్గి'పాలయ్యాయి... ఆదుకోండి...!