ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు'' - 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ

భూ రికార్డుల స్వచ్ఛీకరణ, ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతి అంశాలపై ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇతర మంత్రులు... పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ భూసేకరణ, భూరికార్డుల స్వచ్ఛీకరణలపై మంత్రులు అధికారులతో చర్చించారు.

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ

By

Published : Sep 24, 2019, 8:42 PM IST

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​లో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ, గృహనిర్మాణాల ప్రగతి, రెవిన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో భూరికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టి... జమాబంది కాలంనాటి పటిష్టమైన సమర్థ భూపరిపాలన వ్యవస్థ పునరుద్ధరణకు పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేనివారిని గుర్తించి...వారి సంఖ్యను బట్టి, భూసేకరణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో లాండ్ సీలింగ్ భూములను ఇంటి స్థలాల కోసం వినియోగించుకోవాలన్న మంత్రి.. ట్రిబ్యునల్, కోర్టుల్లో ఉన్న కేసులను సంయుక్త కలెక్టర్ సమీక్షించి, సత్వర పరిష్కారం వచ్చేలా ప్రయత్నించాలన్నారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు మాట్లాడుతూ గృహనిర్మాణ లబ్ధిదారులకు చెల్లింపులో జాప్యం జరగకుండా ఒక ప్రత్యేక యాప్​ను రూపొందించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details