ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలతో నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకుంటాం : మంత్రులు - మంత్రి సిదిరి అప్పల రాజు తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలంలో మంత్రులు ఆళ్ల నాని, సీదిరి అప్పలరాజు పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న చేపల, రొయ్యల చెరువులను పరిశీలించారు. ఆక్వా రైతులతో మాట్లాడిన మంత్రులు...ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Ministers alla nani sidiri appalaraju
Ministers alla nani sidiri appalaraju

By

Published : Oct 17, 2020, 12:58 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలంలో వరద వల్ల దెబ్బతిన్న చేపలు, రొయ్యల చెరువులను మంత్రులు ఆళ్లనాని, సీదిరి అప్పలరాజు, పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఏలూరు గ్రామీణ మండలం మాదేపల్లి, శ్రీపర్రు, జాలిపూడి, గుడివాకలంక, లింగరావుగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరదలకు ధ్వంసమైన చేపలు, రొయ్యల చెరువులను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. ఏలూరు, దెందలూరు మండలాల్లో వరద వల్ల నష్టపోయిన చేపలు, రొయ్యల రైతులను ఆదుకుంటామని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని బాధితులకు భరోసా ఇచ్చారు. నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన లంక ప్రాంతాల ఆక్వా రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అప్పలరాజు అన్నారు. వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లాలో 3 వేల హెక్టార్లలో చెరువులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి :దేశవాళీ వ్యవసాయం.. సాగులో సంప్రదాయం

ABOUT THE AUTHOR

...view details