గోదారమ్మ శాంతించాలని హారతి - మంత్రి
పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలు సంభవించిన గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని...మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత భరోసా ఇచ్చారు.

గోదారమ్మ శాంతించాలని హారతి
వరద బాధితులను ఆదుకుంటామని మంత్రి తానేటి వనిత అన్నారు. గోదావరి ఏటి గట్టు పరివాహక ప్రాంత గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. గోదావరి మాత శాంతించాలని పసుపు కుంకుమలతో గోదావరికి హారతులు అందించారు. గత ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టలేక పోయిందని విమర్శించారు. ఆపద వస్తే ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని తెలిపారు.
గోదారమ్మ శాంతించాలని హారతి