ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కు కోసం చిత్తశుద్ధితో పోరాటం: మంత్రి విశ్వరూప్

By

Published : Mar 12, 2021, 1:16 PM IST

విశాఖ ఉక్కు కోసం.. ప్రజల తరఫున చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

minister vishwaroop on vishaka steel plant privatisation
విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు నినాదానికి వైకాపా కట్టుబడి ఉంది: మంత్రి విశ్వరూప్

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదానికి వైకాపా కట్టుబడి ఉందని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఇందుకు ప్రజల తరఫున చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ పరిశ్రమను ప్రైవేట్​పరం చేయాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని.. సీఎం జగన్ రెండుసార్లు కేంద్రానికి లేఖ రాశారన్నారు. రాష్ట్ర భాజపా, జనసేన పార్టీ నేతలు.. ఉక్కు పరిశ్రమ ప్రైవేట్​పరం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రం నిర్ణయంపై తాము చేసే పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details