ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా సంక్షేమమే.. ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వేణుగోపాలకృష్ణ - Minister Venugopal Krishna initiated many development works at thallarevu

పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్లలో అభివృద్ధి పనులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ కొయ్యిమోషేన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వేణుగోపాల కృష్ణ
మంత్రి వేణుగోపాల కృష్ణ

By

Published : Jun 30, 2021, 12:15 PM IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్ళలో రూ. 4.30 కోట్లతో నిర్మించిన సీసీ రహదారులు, రూ. 93 లక్షలతో నాడు - నేడులో అభివృద్ధి చేసిన పాఠశాల, రూ. 62 లక్షలతో నిర్మించిన సచివాలయం రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు,మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్.. ప్రజల కష్టాలను నేరుగా పరిశీలించి, తనకంటూ వచ్చిన ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్​కు దీటుగా అభివృద్ది చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొయ్యిమోషేన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details