విద్యా వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, చాగల్లులో ప్రారంభించి విద్యార్థులకు కానుకలు అందజేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లీష్ మీడియంలో బోధన వైపు ప్రభుత్వ పాఠశాలలు అడుగులు వేస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల విద్యార్థులకు రూ.650 కోట్లతో విద్యా కానుక అందజేస్తున్నట్లు చెప్పారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు: మంత్రి వనిత - మంత్రి తానేటి వనిత తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, చాగల్లులో మంత్రి తానేటి వనిత జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని తెలిపారు.
తానేటి వనిత, మంత్రి