ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు పంపిణీ - Distribution of electric bicycles at eluru

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా లబ్ధిదారులకు సైకిళ్లు, హెల్మెట్లు అందజేశారు.

Distribute electric bicycles to the disabled
దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ

By

Published : Jul 15, 2021, 3:53 PM IST

తమ అవసరాల కోసం దివ్యాంగులు.. ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకే మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిళ్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి తానేటి వనిత, కలెక్టర్ కార్తికేయ మిశ్ర.. చేతుల మీదుగా సైకిళ్లు, హెల్మెట్లు అందించారు.

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు ఈ సైకిళ్లు ఎంతగానో తోడ్పడుతాయని మంత్రి అన్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసుకునేందుకు ఉపయోగపడుతాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రతోపాటు, ఇతర ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details