నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు పూర్తి భద్రత కల్పించి.. తగిన గౌరవం ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు స్పష్టం చేశారు. తనకు ప్రాణహాని ఉందన్న ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. ఆయనకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
'ఎంపీ రఘురామకృష్ణరాజుకు పూర్తి భద్రత కల్పిస్తాం'
తనకు ప్రాణహాని ఉందన్న ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు స్పందించారు. ఆయనకు పూర్తి భద్రత కల్పించి.. తగిన గౌరవం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
'ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పూర్తి భద్రత కల్పిస్తాం'
పశ్చిమగోదావరి జిల్లాలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవని..ఎంపీకి పూర్తిగా రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. ఇళ్లపట్టాల అక్రమాలపై ఎంపీ ఫిర్యాదు చేయడం మంచిదేనని.. పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఆ బాధ్యత ఉందన్నారు. తన నియోజకవర్గంలో ఇళ్లపట్టాల పంపిణీ అక్రమాలపై చర్యలు చేపట్టామని తెలియజేశారు.