పశ్చిమగోదావరి జిల్లా గణపవరం చింతలపాటి మూర్తిరాజు శత జయంతి ఉత్సవాలకు ఈ నెల 14న ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. వేడుకలను చింతలపాటి మూర్తిరాజు డిగ్రీ కళాశాలలో జరపనున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఎనలేని సేవలు మూర్తిరాజు చేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించిన వ్యక్తి అంటూ కొనియాడారు. 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగాను, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తని ప్రశంసించారు. ఆయన యావదాస్తితో నిర్మించిన గాంధీ భవనాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామన్నారు.
ఈ నెల 14న చింతలపాటి మూర్తిరాజు జయంతి వేడుకలకు సీఎం హాజరు - గణపవరానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాక
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం చింతలపాటి మూర్తిరాజు డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు.
![ఈ నెల 14న చింతలపాటి మూర్తిరాజు జయంతి వేడుకలకు సీఎం హాజరు చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5333173-650-5333173-1575996027261.jpg)
చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం
చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం