ప్రముఖ పుణ్యక్షేత్రం.. ద్వారకాతిరుమల వెంకన్నను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు తన పార్టీ నాయకులతో కోర్టులో కేసులు వేసి 6 నెలల నుంచి ఆపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచలేదని పేర్కొన్నారు.
'ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు' - plots distribution in ap news
అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు తన పార్టీ నేతలతో కోర్టుల ద్వారా స్టేలు తెచ్చి పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని... మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
!['ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు' Minister Sri Ranganatha Raju Fires on Chandrababu Over House plots](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8859608-763-8859608-1600512985668.jpg)
చెరుకువాడ శ్రీరంగనాథరాజు
గుళ్లపైనా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. కోర్టు నుంచి అనుమతి రాగానే మరో 15 లక్షల ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని పేదలకు గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించి ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం