పంటసాగులో శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల.. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు నాయకులు, అభ్యుదయ రైతులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.
'రైతులు నిపుణుల సలహాలు పాటించాలి'
రైతులు.. శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధిస్తారని రాష్ట్ర మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన..రైతులకు పలు సూచనలు చేశారు. అన్నదాతలు రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
Minister ranganathraju
గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల వల్ల.. రైతుకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. పంటసాగులో సాంకేతిక సలహాలు రైతుకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సాగు ప్రారంభం నుంచి కోత వరకు నిపుణుల సలహాలు పాటించాలని ఆయన రైతులకు సూచించారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదు