పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపాధి హామీ పనుల ప్రగతిపై మంత్రి పేర్ని నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ఎమ్యెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జిల్లాలో పలు భవన నిర్మాణాల పూర్తికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. గ్రామస్థాయిలో పాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి.. పక్కా భవనాలు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
'గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు పక్కా భవనాలు'
రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, అంగన్వాడీ, ఆరోగ్య ఉపకేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
minister-perni-nani-on-permenent-buildings-to-raitha-bharosa-centers