ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరగవరంలో సరకులు పంచిన మంత్రి పేర్ని - ఇరవరంలో మంత్రి పేర్ని నాని పర్యటన

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. పేదలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్న పనులు అభినందనీయమని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇరగవరంలో పర్యటించిన మంత్రి... పోలీసులు, నాయీ బ్రాహ్మణులు, ఆటో డ్రైవర్లకు సరకులు అందజేశారు.

minister perni nani in iragavaram
ఇరగవరంలో మంత్రి పేర్ని నాని

By

Published : May 14, 2020, 11:53 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాలలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి పోలీసులకు, ఆటో డ్రైవర్లుకు, నాయీ బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

లాక్‌డౌన్ ‌అమలుతో ఇబ్బంది పడేవారికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details