గ్రామ వాలంటీర్ల సేవలు ఉన్నతమైనవి : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి - పెనుమంట్ర మండలంలో గ్రామ వాలంటీర్ల సత్కార కార్యక్రమం
గ్రామ వాలంటీర్ల సేవలు అమోఘం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడంలో గ్రామ వాలంటరీలు సఫలీకృతం అయ్యారని తెలిపారు.
minister sriranganatha rao
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు రెడ్డి కల్యాణ మండపంలో జరిగిన గ్రామ వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఉత్తమ వాలంటరీలను సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద 9 కోట్లు విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..రెండు రోజుల్లో పెళ్లి- కరోనాతో నర్సు మృతి