Rythubandhu 4th Day : తెలంగాణలో నాలుగో రోజు రైతుబంధు పథకం పెట్టుబడి సాయం కింద రూ.575.09 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి 4,57,697 మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి. 11,50,191.09 ఎకరాలకు నిధులు విడుదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో దేశ రాజకీయాలపై తెలంగాణ ముద్ర ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే అనుసరణీయం అని కొనియాడారు. రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారులు పెరుగుతుంటే.. దేశంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్ధిదారులు తగ్గుతున్నారని ఆక్షేపించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఉన్న 11 కోట్ల లబ్ధిదారులు 3 కోట్లకు పడిపోయారన్నారు.
Rythubandhu: నాల్గో రోజు రైతుల ఖాతాల్లోకి రూ.575 కోట్లు - వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
Rythubandhu 4th Day : తెలంగాణ రాష్ట్రంలో నాలుగో రోజు రైతుబంధు నిధులను మంత్రి నిరంజన్‌రెడ్డి విడుదల చేశారు. రూ.575.09 కోట్లను రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల నుంచి 8 కోట్ల మంది లబ్ధిదారులను ఈ పథకం నుంచి ఎగరగొట్టారని ఆరోపించారు. 50 లక్షల మందిగా ఉన్న రైతుబంధు లబ్ధిదారులు.. 70 లక్షలకు పెరిగారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. వ్యవసాయ రంగం, రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తీవ్రంగా తప్పుపట్టారు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ 60 శాతం జనాభా పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎద్దేవా చేశారు. ఇందుకు తగిన విధానం వారి వద్ద లేదని విమర్శించారు.
ఇవీ చదవండి: