ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు: మంత్రి ఆళ్ల నాని - మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొవిడ్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యంతోపాటు.. పౌష్ఠకాహారం అందించడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు: మంత్రి ఆళ్ల నాని
మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు: మంత్రి ఆళ్ల నాని

By

Published : Jul 11, 2020, 7:14 PM IST

కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యంతోపాటు.. పౌష్ఠకాహారం అందించడానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొవిడ్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో భోజన వసతులపై అధికారులను ఆరా తీసిన మంత్రి... రోగులకు అందించే భోజనాన్ని తిని రుచి చూశారు.

కరోనా బాధితులకు నాణ్యమైన భోజనం అందించానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మరిన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి జిల్లాకు కొవిడ్ సంచార పరీక్షా వాహనాలు ఏర్పాటు చేసి... పరీక్షల సంఖ్యను మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details