ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గడప గడపకు మన ప్రభుత్వం'లో మంత్రి కారుమూరి.. లబ్ధిదారులకు కరపత్రాలు పంపిణీ..! - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

GADAPA GADAPA: తణుకు పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డులో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పాల్గొన్నారు. కుటుంబాలకు వ్యక్తిగతంగా లభించిన లబ్ధి వివరాలతో కరపత్రాలు పంపిణీ చేశారు.

GADAPA GADAPA
గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి కారుమూరి

By

Published : Jun 3, 2022, 7:18 PM IST

GADAPA GADAPA:పశ్చిమగోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం పరిధిలోని 20వ వార్డులో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. కుటుంబాలకు వ్యక్తిగతంగా లభించిన లబ్ధి వివరాలతో కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నామని మంత్రి కారుమూరి చెప్పారు. గడపగడపకు వెళ్తున్నప్పుడు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పలుచోట్ల మంత్రికి మహిళలు హారతులు పట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details