సచివాలయంలో ఆయిల్ ఫామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం లేకుండా ధరలు ఉండేలా చూడాలని ఆయిల్ ఫామ్ కంపెనీలని మంత్రి ఆదేశించారు. రైతులకు లాభం చేకూర్చేలా నూతన పాలసీని తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.
'మిడతల దండుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’
మిడతల దండుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కన్నబాబు ధైర్యం చెప్పారు. దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను, ఎంటమాలజీ నిపుణులను కోరామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయిల్ ఫామ్ రైతులు, కంపెనీల ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు.
మిడతలపై మంత్రి కన్నబాబు
మిడతల దండు ఏపీకి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంతో.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు మంత్రి ధైర్యం చెప్పారు. దీనిపై అధ్యయనం చేయాలని అధికారులను, ఎంటమాలజీ నిపుణులను కోరామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మిడతలు ఏపీలోకి ప్రవేశిస్తాయన్న స్పష్టమైన సమాచారం లేదని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:'మహానేత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి'