భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (Minister kannababu on crop damage in ap) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, వరిఘేడు, రేలంగి, బి.కొండెపాడు గ్రామాల్లో వరదలకు నష్టపోయిన పంటలను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కొట్టు సత్యనారాయణ కలిసి పరిశీలించారు.
పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పంట దిగుబడులు, కౌలు రైతుల పరిస్థితిపై ఆరా తీశారు. కౌలు రైతులకు భూమి యజమానులు ఎంతవరకు సహకరిస్తున్నారని అడిగారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా వివరాలు నమోదు చేయాలని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.