ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో పర్యటించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ - తణుకులో పర్యటించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో.. మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. తణుకులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, శిథిలావస్థకు చేరిన సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాన్ని పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న కార్యాలయాలను.. పునః నిర్మించేలా చర్యలు తీసుకోవాలని.. మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

minister dharmana krishnadas visits tanuku
తణుకులో పర్యటించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Jul 25, 2021, 5:26 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. తణుకులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, శిథిలావస్థకు చేరిన సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తణుకులో శిథిలావస్థకు చేరిన సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాన్ని మంత్రి ధర్మాన స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు.

భవనాలు శిథిలావస్థకు చేరటంతో.. కొత్తగా భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిని కోరారు. ప్రధాన సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయంతో పాటు.. సజ్జాపురంలోని సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం కూడా కలిపి ఒకే చోట నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details