అధికారులు పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న పనులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారంలో ముందుండాలి: చెరుకువాడ
ప్రజా సమస్యల పరిష్కారంపై అలసత్వం చూపొద్దని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులకు సూచించారు. ఆచంట నియోజకవర్గంలోని పలు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు