పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గృహానిర్మాణ పథకం ఉద్యోగులు, సిబ్బందితో మంత్రి చెరుకువాడ రంగనాథరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్, చీఫ్ ఇంజినీర్ మల్లికార్జున రావుతో పాటు 13 జిల్లాల పీడీలు, ఇంజినీర్లు పాల్గొన్నారు. నవరత్నాల్లో భాగంగా 15లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. 30.7 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడంలో ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు.
గృహనిర్మాణ పథకం ఉద్యోగులతో మంత్రి చెరుకువాడ సమీక్ష - తాడేపల్లిగూడెం వార్తలు
మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గృహనిర్మాణ పథకం ఉద్యోగులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో సబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. హౌసింగ్ శాఖలో పనిచేసే క్షేత్ర స్థాయి ఉద్యోగులకు అలెవెన్స్లు అందేలా చూస్తానని హామీఇచ్చారు. ఎన్నికల తరువాత ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సీఎం జగన్ ఇళ్ల నిర్మాణంపై ప్రతివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే అవకాశం సీఎం తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హౌసింగ్ శాఖలో పనిచేసే క్షేత్రస్థాయి ఉద్యోగులకు అలెవెన్స్ అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల తరువాత ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. చురుగ్గా ఏర్పాట్లు