ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది' - జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం

ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి విడతలో 17 లక్షల గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

minister cherukuvada sri ranganatha raju
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

By

Published : Jun 18, 2021, 3:38 PM IST

రాష్ట్రంలోని జగనన్న కాలనీల్లో పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. జగనన్న కాలనీలను పరిశీలించిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి స్థలం, ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి విడతలో 17 లక్షల గృహాలు నిర్మించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందని.. ఆచంట నియోజవర్గంలో ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసి ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details