కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయా ప్రాంతాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడిన ఆయన... కొవిడ్ ఆస్పత్రుల్లో మరణించిన వారిని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకురాని పరిస్థితి నెలకొందని తెలిపారు. పదుల సంఖ్యలో మృతదేహాలు మార్చురీలో ఉండిపోతున్నాయని అన్నారు. మృతదేహాలు సీజ్ చేయించినా.. బంధువులు తీసుకెళ్లడంలేదని వివరించారు. ఇలాంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో అధికారులు కల్పించుకొని...అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.
'అంత్యక్రియల విషయంలో అధికారులే చొరవ తీసుకోవాలి'
కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ముందుకురాకపోవడం చాలా బాధాకరమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని...అంత్యక్రియలు పూర్తి చేసేలా చూడాలని సూచించారు.
minister cherukuvada sri ranganadha raju