ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: మంత్రి చెరుకువాడ

By

Published : Dec 27, 2020, 9:11 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తేతలి గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి పంపిణీ చేశారు. 600 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు.

వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తేతలి గ్రామంలో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉండగా.. 27 శాతం కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల స్థలాల నిమిత్తం 12 వేల కోట్లతో భూసేకరణ చేపట్టామన్నారు. కొత్తగా నిర్మించే ఇళ్ల ద్వారా రాష్ట్రంలో 17,500 కొత్త గ్రామాలు వస్తాయన్నారు.

వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులందరూ...ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఇళ్లపట్టాల పంపిణీపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details