తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. లబ్ధిదారులు తెలుగుదేశం సానుభూతిపరులేనని ఆరోపించిన బొత్స.... దీనిపై తణుకు ఎమ్మెల్యేతో మాట్లాడానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఓ విధానం లేకుండా ఆరోపణలు చేస్తోందని బొత్స అన్నారు.
టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోంది: మంత్రి బొత్స - West Godavari district news
తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పురపాలక శాఖ విచారణ చేస్తోందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు తెలుగుదేశం సానుభూతిపరులేనని ఆరోపించారు.
Minister Botsa react on Tanuku Issue
ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తలేక ఒకే అంశంపై శాసనసభ, మండలిని నిలుపుదల చేస్తోందని విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలు జరిగే సమయంలో అడ్డుకుంటున్నారనే... వారిపై సస్పెన్షన్ వేటు పడిందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:'టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎమ్మెల్యే కారుమూరిని అరెస్టు చేయాలి'