ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల హామీలు అమలు చేసిన ఘనత జగన్​కే దక్కుతుంది: బొత్స - house rails distribution news

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఏలూరు మండలాల్లో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

minister botsa
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

By

Published : Jan 4, 2021, 8:50 PM IST

నవరత్నాల్లో భాగంగా....పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి 3,347 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మహిళలు సొంత ఇంటి కోసం చేసుకున్న విజ్ఞాపనలు దృష్టిలో ఉంచుకొని... ఎన్నికల ముందే తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారని మంత్రి బొత్స గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికను ప్రజలకు వివరించడం ముఖ్యమని, ఎన్నికల తర్వాత చాలా పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తమ కుటుంబాల కోసం దోచుకోవడం, తమ సామాజిక వర్గానికి చెందిన వారి అభివృద్ధి కోసం కృషి చేశారని విమర్శించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

గత ప్రభుత్వం ఒక్క ఇంటిపట్టా ఇవ్వలేదు: బొత్స

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిత్యం శ్రమిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పోనంగిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానితోపాటు.. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడువేలమంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. పేదలకు సొంతింటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిందని బొత్స అన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఇంటి పట్టాను సైతం పంపిణీ చేయలేకపోయారని విమర్శించారు.

ఇదీ చదవండి:

సజ్జల, కొడాలి మధ్య వాటాల తేడాలతో బయటపడ్డ పేకాట శిబిరాలు: దేవినేని

ABOUT THE AUTHOR

...view details