తీరప్రాంతాన్ని అభివృద్ది చేసి మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపి, యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో రూ.18.58 కోట్లతో నిర్మించనునున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను, వేములదీవి ఈస్ట్‌లో 300 ఏకరాల్లో రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న "ఆక్వా యూనివర్సిటీ" స్థలాలను మంత్రి పరిశీలించారు.
'మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే మా లక్ష్యం' - Minister seediri Appalaraju latest news
రాష్ట్రంలోని తీరప్రాంత రూపురేఖలు మార్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలసి మంత్రి పర్యటించారు.
!['మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే మా లక్ష్యం' Minister Appala Raju Tour In West Godavari District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8862079-904-8862079-1600519606501.jpg)
సీదిరి అప్పలరాజు
అనంతరం ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, 3 చోట్ల పోర్టులు, 3 చోట్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండీ... ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు