జూలై 15 నాటికి 50 వేల గృహాలు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తీసుకువస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం జీలుగుమిల్లి మండలం రౌతు గూడెంలో రెవెన్యూ గృహ నిర్మాణ సంస్థ ఆర్ అండ్ ఆర్ అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు.
‘జూలై 15 నాటికి నిర్వాసితులను కాలనీలకు తరలిస్తాం’ - పోలవరం నిర్వాసితులపై వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. మొదటి దశలో 17వేల కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 నాటికి కాలనీలకు తరలిస్తామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలు పరిళీలిస్తున్న మంత్రులు
ముప్పైవేల కోట్లకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు కేవలం 15 శాతం మాత్రమే జరిగాయని మంత్రి అనిల్ అన్నారు. మొదటి దశలో 17వేల కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా జూలై 15 నాటికి కాలనీలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. రానున్న మూడు సంవత్సరాల్లో కాలనీల నిర్మాణాలు పూర్తి చేసి నిర్వాసితులు అందరిని పూర్తిస్థాయిలో తరలిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి