గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ సరిగాలేదని వైద్య ఆరోగ్య శాఖ ఆళ్ల నాని అన్నారు. దీన్ని ప్రక్షాళన చేసి రానున్న రోజుల్లో వైరస్ కేసులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న సిబ్బంది పక్రియ త్వరలో చేపడతామన్నారు. కొత్తగా నిర్మించే ఒక్కొక్క ఆస్పత్రి నిర్మాణానికి 350 నుంచి 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలల ఏర్పాటు: ఆళ్ల నాని - రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తాజా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి.. మెరుగైన వైద్యం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
minister alla nani on medical hospital
ప్రతిపాదించిన కొత్త ఆసుపత్రులు ఎక్కడ నిర్మించాలన్న దానిపై ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. నర్సింగ్ కళాశాలను మంత్రి పరిశీలించి.. పనులు పూర్తికి రూ.1.50 కోట్లు కేటాయించారు.
ఇదీ చదవండి: అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్