ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులను ప్రతిక్షణం పరీక్షిస్తున్నాం: ఆళ్ల నాని

ఏలూరు ఘటనపై.. మంత్రి ఆళ్లనాని స్పందించారు. బాధితులు ఉన్న చోట నీటి కాలుష్యం, విషాహారం ఉన్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులన్నిటిని ప్రతిక్షణం పరీక్షిస్తున్నామని తెలిపారు.

ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులను ప్రతిక్షణం పరీక్షిస్తున్నాం
ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులను ప్రతిక్షణం పరీక్షిస్తున్నాం

By

Published : Dec 6, 2020, 8:07 PM IST

ఏలూరు ఆస్పత్రికి వచ్చిన కేసులన్నిటినీ ప్రతిక్షణం పరీక్షిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 270 కేసులు నమోదయ్యాయన్నారు. చికిత్స తర్వాత ఒకట్రెండు గంట్లలోనే బాధితులు సాధారణ స్ధితికి వస్తున్నారని చెప్పారు.

"మెరుగైన చికిత్స కోసం ఏడుగురు బాధితులను విజయవాడ పంపించాం. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 30 మంది‌ డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. 146 మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాం. ఇవాళ ఉదయం 43 కేసులు వచ్చాయి. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారు. బాధితులు ఉన్నచోట నీటి కాలుష్యం ఎక్కడా జరగలేదు. విషాహారం తిన్న దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు. సీఎఫ్ఎస్ టెస్టు రిజల్ట్‌కు 48 గంటలు పడుతుంది. రేపు ఉదయానికి సీఎఫ్ఎస్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు వస్తున్నారు" అని మంత్రి నాని వెల్లడించారు.

ఫిట్స్ వచ్చిన వారికి సంబంధిత మందులు ఇస్తున్నామన్న ఆయన... భయాందోళనతో వచ్చినవారు చాలామంది ఉన్నారని వెల్లడించారు. పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యాకే బాధితులను డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

మరింత వేగవంతమైన చర్యలకు ఉపక్రమించాలి: గవర్నర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details